Contract Employees Regularization in TS
Telangana State Government Released G.O MS No.16 For
Contract Employees Regularization.
Government of Telangana issued G.O.Ms.No.16 finance(HRM.l)Department
Dated:26/02/2016, Acts- The Andhra Pradesh Re organization Act,1994 (Act 2 of
1994)-Adaptation to the State of Telangana. Regularisation of Contract
Employees in Telangana Issued G.O.Ms.No.16.
According to Regulation of Appointments to Public Services
and Rationalization of Star pattern and pay Structure of 1994 Act ,Telangan
Government Made Changes to Previous Union AP State Act, For Telangana.
కాంట్రాక్ట్
ఉద్యోగుల క్రమబద్థీకరణ
ఉమ్మడి
ఏపీ చట్టాన్ని
స్వీకరించిన ప్రభుత్వం
- సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు ఆచరణ రూపం
-27వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి
హైదరాబాద్: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు మార్గం సుగమమైంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు వీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1994 చట్టంలోని నియామకాలు, క్రమబద్ధీకరణ నిబంధనలను, రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్, జీతభత్యాల విధానాలను తెలంగాణ ప్రభుత్వానికి అనువర్తింపచేస్తూ శుక్రవారం తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. చట్టాలను, జీవో నం.212, 1994 నిబంధనలను, తెలంగాణ ప్రభుత్వానికి అన్వయించుకుంటూ అవసరమైన నిబంధనలను సవరిస్తామని, చట్టసభల ఆమోదం తీసుకుంటామని తెలియచేస్తూ ఆదేశాలను ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ గెజిట్లో దీనిని ప్రచురించనున్నారు. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉన్నవారితోపాటు అంతకు ముందు కూడా ఉద్యోగంలో ఉన్నవారు, అప్పటికే 5 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన వారికి వర్తించేవిధంగా అవసరమయితే నిబంధనలను మార్చి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను చేపడతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున, క్యాబినెట్ సమావేశంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం చట్టాలను, నిబంధనలను తీసుకువస్తారు. అవసరమయితే చట్టసభల ఆమోదం కూడా తీసుకుంటారు.- సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు ఆచరణ రూపం
-27వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మహోన్నతమైన నిర్ణయంగా తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్లో ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014, సెక్షన్-101 నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ రెగ్యులరైజేషన్ నిబంధనలను చేపడుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2, 2014 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చినట్లుగా తెలంగాణ ప్రభుత్వం గెజిట్లో ప్రకటించనున్నది. ఏపీ జనరల్ క్లాజ్ చట్టం-1991 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనలను తెలంగాణకు వర్తింపజేస్తున్నది. దీనితో రాష్ట్రంలో వివిధ శాఖలలో దాదాపు 10 నుండి 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు రాజముద్రపడింది. ఈ ప్రక్రియవల్ల 27వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ కావడానికి మార్గం సుగమమైందని తెలంగాణ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్నాథం ప్రవీణ్ పేర్కొన్నారు. రాష్ట్రమంత్రి కేటీఆర్ జూలై 24, 2011న తన జన్మదినోత్సవం రోజున కాంట్రాక్ట్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలో రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని, దానిని ఇప్పుడు నిలబెట్టుకున్నారని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు తమ సంస్థ ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. ప్రతీ నెల నిర్ణీత వేతనం తీసుకుంటూ, పూర్తిస్థాయిలో అర్హతలుకలిగిన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తారు. కాంట్రాక్ట్ విధానంలో మధ్యలో గ్యాప్లు ఉన్నవారిని, క్రమశిక్షణాచర్యలు ఎదుర్కొన్న వారిని కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి అనుమతిస్తారు. అయితే జీవో నం.22 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2015లో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ఉన్నతస్థాయి కమిటీ 1994 చట్టం నిబంధనలను, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం అనువర్తింప చేసుకోవాలని తన నివేదికలో సూచించింది. అదేవిధంగా జీవో నం.19 ప్రకారం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచనున్నారు. పెంచిన వేతనాలు జనవరి నుంచే అమలులోకి వస్తాయని ఆదేశాలలో స్పష్టంచేశారు.
Contract Employees Regularisation G.O.Ms.No.16
I think people will benefit from this. there are so many people who are working like a regularised people but their wages are completely low when compare to regular people.Nice decision taken by telangana government.
ReplyDeleteWonderful CM Great decision making...
ReplyDelete